రాజస్థాన్ రగడ బలపరీక్షతో ముగుస్తుందా?
ఫిరాయింపుల రాజకీయాలు

తొమ్మిది వందల యాభైఎనిమిదిలో కేరళ రాష్ట్ర కాంగ్రె సేతర కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టడం నుంచి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన ప్పటి గవర్నర్ రామ్‌లాల్‌తోసహా నేటిదాకా దశాబ్దాలు గడిచినా అదే పాతకథ మళ్లీ మళ్లీ పునరావృతమవుతోంది.
కేంద్రంలోని అధికారపార్టీ రాష్ట్రాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాలను అస్థిరపరచడం జరుగుతుంది.
ప్రతిపక్ష పార్టీలలో ముసలం పుట్టించి పెద్దఎత్తున అధికారం, డబ్బుల ఎరవేసి ఫిరా యింపుల రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు.
ఆయారామ్ గాయా రాం సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు.మొన్నటికి మొన్నకర్ణాటక, నిన్న మధ్యప్రదేశ్, నేడు రాజస్థాన్‌రాజకీయం రంజుగా మారింది.
ఇది ఫిరాయింపుల రాజకీయాలకు పరాకాష్టకు చేర్చింది. నేడు రాజస్థాన్‌లో జరుగుతున్న రాచక్రీడను చూస్తే సామాన్య ప్రజలకే కాదు పాతతరం రాజకీయ నాయకులకు కూడా రాజకీయాలంటే అసహ్యం వేసే పరిస్థితి వచ్చింది.
ముఖ్యమంత్రి తనకు మెజార్టీ ఉంది మొర్రో అంటూ రాజ్‌భవన్ ముందు తన ఎమ్మెల్యేలతో బలప్రదర్శన చేసినా బలనిరూపణకు కోర్టు సాకులు చూపుతూ గవర్నర్ అనుమతించలేదు.
ముఖ్యమంత్రి గవర్నర్‌కు మూడుసార్లు అసెంబ్లీని సమావేశపరచమని విజ్ఞప్తులు పంపగా రెండుసార్లు ఆ ప్రతిపాదనను వెనక్కి పంపిన రాజస్థాన్ గవర్నర్ ముచ్చటగా మూడోసారి ఆ విజ్ఞప్తిని మన్నించి ఆగస్టు 14న విశ్వాస పరీక్షకు తేదీ నిర్ణయించారు.
ఆగస్టు 14వరకు అధికార పార్టీ స్వయంగా నిర్వహిస్తున్న క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు ఆయనతోనే ఉంటారా లేక బలపరీక్షలో ప్రలోభాలకు లొంగి అవతలి పక్షంవైపు పోతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
అప్పటిదాకా ఈ ఎమ్మెల్యేల కప్పల తక్కెడను కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదే ఉంది. విశ్వాస పరీక్షలో ఒక్కసారి నెగ్గితే మళ్లీ ఆరునెలల దాకా అవస రం ఉండదని ముఖ్యమంత్రి తలపోస్తున్నారు. అప్పటిదాకా తమ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలో తెలియదు.
ఈ లోపు అధికార పక్షం తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే అటు పక్క ముప్ఫై నుండి యాభై కోట్ల రూపాయలకు ఒక ఎమ్మెల్యే చొప్పున సంతలో పశువులను కొనుక్కుంటున్న రీతిలో కొనుక్కో వడానికి కేంద్రంలో ఉన్న అధికారపక్షం బేరసారాలు జరుపుతుం ది.
స్వయంగానే కేంద్రమంత్రి పాత్ర ఈ కొనుగోళ్ల వ్యవహారంలో వివాదాస్పదంగా మారింది. క
రోనా కష్టకాలంలో కూడా అధికార పక్షం కంత్రీ రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తున్న ప్రస్తుత ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై ప్రోత్సహించడం తో తక్కువేమీ తినలేదు.
కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది కూడా ఇంతే.
గురివింద గింజ తన నలుపు ఎరగదన్నట్లు కాంగ్రెసు ప్రవర్తిస్తుంటే నీవ్ఞ నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ బిజెపి దాని అనుసరిస్తోంది. కేంద్రంలో అధికారపార్టీలు మాత్రమే మారుతున్నా యి.
ఎవరు అధికారంలోకి వచ్చినా వారు అవలంభించే పద్ధతులు మాత్రం మారడంలేదు. బాధపెట్టే పార్టీలు బాధిత పార్టీల పాత్ర లు తారుమారు అవుతున్నాయి తప్ప పాత్రల స్వభావం మారడం లేదు.
ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇలా సంక్షోభం లో పడిపోతున్నాయి.ఈ గందరగోళంలో రాష్ట్రప్రభుత్వాలు ప్రజా పాలన గాలికి వదిలేస్తే ప్రజలు అనాధలుగా మిగిలిపోతున్నారు.
తమ కళ్లముందే జరుగుతున్న రాజకీయ జగన్నాటకాన్ని చూస్తూ భరిస్తూ ప్రజలు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు.దీనికి ఏదో ఒక పార్టీని నిందించి ప్రయోజనంలేదు.
సరైన శాశ్వత పరిష్కారాలవైపు ఆలోచించాలి. ఎన్నికలలో పార్టీలకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఒక్క ఎమ్మెల్యే మెజార్జీ ఎక్కువ ఉన్న ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి.
ఒక్కోసారి ఎవరికీ మెజార్టీ రాకపోయినా సింగి ల్ లార్జెస్ట్ పార్టీ ఇతర పార్టీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది .
కానీ తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి.ఆ తర్వాత అస్థిరత్వంలోకి నెట్టబడుతున్నాయి.
ఇలాఉండకుండా ఉండాలంటే రాష్ట్రాల ముఖ్య మంత్రులను రాష్ట్రంలోని ఓటర్లు అందరూ ప్రత్యక్షంగా ఎన్నుకో వాలి. అలాగే శాసనసభ్యులను కూడా ఎన్నుకుంటారు.
శాసనసభ లో మెజారిటీ ఏ పక్షానికివచ్చినా ప్రత్యక్షంగా ఎన్నికయ్యే ముఖ్య మంత్రి తనమంత్రివర్గంలోకి ఎవరినైనాతీసుకునే వీలు ఉంటుంది.
తనపక్షంనుండి కాకుండా ఎదుటిప్రతిపక్షం నుంచి కూడా అర్హులైన ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు.వీరేకాదు సమా జంలోని నిపుణులను ఇతరప్రత్యేకతలు కలవారిని కూడా మంత్రి వర్గంలోకి తీసుకునే వీలుకలుగుతుంది.
1991లో పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా అప్పటి ఆయన మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆనాడు ఎన్నుకున్న ఉభయసభలలో దేనిలోనూ కూడా సభ్యులు కారు అన్న సంగతి మనం గమనించాలి.
ఆ తర్వాత మన్మోహన్ సింగ్ పదేళ్లు ప్రధాని గా పనిచేశారు. అలా బయటి వారిని తెచ్చుకునే వెసులుబాటు ఇప్పటికంటే ఇంకాఎక్కువగా ఉంటుంది.
ప్రజలకు ఉపయోగకర మైన చట్టాలు చేయడానికి మాత్రమే శాసనసభకు శాసనమండలికి అధికారం ఉంటుంది.
దీనివల్ల రెండు లాభాలు జరుగుతాయి. ఒకటి ఎమ్మెల్యేల మెజార్టీ మీదప్రభుత్వాలు ఆధారపడి ఉండవ్ఞ. ప్రత్యక్షంగా ఎన్నికైన ముఖ్యమంత్రి తాను చేద్దామనుకున్న పని సజావ్ఞగా చేయవచ్చు.
వాటిలో ప్రజావ్యతిరేక చర్యలు ఉంటే చట్టాలు కాకుండా శాసనసభలు అడ్డుకోవచ్చు.దేశవ్యాప్తంగా ఇప్ప టికే చిన్న రాష్ట్రాల డిమాండ్ ఉంది.
ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మరొక నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని డిమాండ్ అక్కడి అన్ని రాజకీయపక్షాలు చేస్తున్నాయి.
అలాగే దేశవ్యాప్తంగా మరో ఏడెనిమిది రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి. చిన్న రాష్ట్రాల కల సాకారమైతే ముఖ్యమంత్రుల ప్రత్యక్ష ఎన్నిక కూడా మరింత సులవ్ఞతుంది.
ప్రస్తుత ఎన్డీయే ఆధ్వర్యంలో ఉన్న కేంద్రప్రభుత్వం ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనే విషయాన్ని ముందుకు తీసు కువచ్చింది. పంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకు ఒకేసారి ఎన్నికలు జరపాలని ఆలోచన చేస్తోంది.
దీనికి మొదటి అడుగుగా ముఖ్యమంత్రి ప్రత్యక్ష ఎన్నికలు అనేఅంశం పనికివస్తుంది. శాసన సభ రాజ్యసభ శాసనమండలి లాగానే శాశ్వత సభగా ఉంటుంది.
ఎమ్మెల్యేల బేరసారాలలో ఉండదు. కప్పల తక్కెడ ఫిరాయింపు రాజకీయాలు ఉండవు.
ఐదు సంవత్సరాలు పాలన నిరాటకంగా సాగుతుంది.నచ్చకపోతే మళ్లీ వచ్చేఎన్నికల్లో ప్రజలు ముఖ్య మంత్రిని మారుస్తారు.
రాష్ట్రం మొత్తానికి స్టేచర్ ఉన్న నాయకుడే ముఖ్యమంత్రి అవ్ఞతాడు.ఢిల్లీనుంచి వచ్చే సీల్డ్‌కవర్ రాజకీయాలకు చరమగీతం పాడొచ్చు.
గతంలో ఎన్టీరామారావ్ఞ మండల వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక మొదలుకొని మండల ప్రజాపరిషత్ జిల్లాపరిషత్ ఛైర్‌పర్సన్‌లను కూడాప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్నారు.
అప్పుడు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కూడా చాలా తక్కువైయింది.
అలా ఇప్పుడు కూడా పంచాయతీ నుంచి మొదలుకొని జిల్లాపరిషత్‌వరకు అలాగే రాష్ట్రముఖ్యమంత్రి కూడా ప్రత్యక్ష ఎన్నికద్వారా ఎన్నుకుంటే మాత్రమే ప్రస్తుత ఫిరాయింపు రాజకీయాలకు సరైన పరిష్కారం లభిస్తుంది.
సమస్య వచ్చినప్పుడే తలపట్టుకుని గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరుకో వడం కాకుండా దేశంలో ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులు చేసి ఎంపిల ఎమ్మెల్యేల ఎన్నికల విధానం కూడా మార్చాలి.
రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం పెంచాలి.
దామాషా పద్ధతిన పార్టీలకువచ్చిన ఓట్లశాతాన్ని బట్టి రాజకీయపార్టీలకు ఎంపిలు,ఎమ్మెల్యేల సీట్లు కేటాయించేవిధానం రావాలి. అప్పుడే ప్రస్తుత సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
-బండారు రామ్మోహనరావు
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/