ధూమపాన నిషేధంలో ద్వంద్వ వైఖరి

పూర్తిగా నిషేధం అవసరం

A complete ban on smoking is required
A complete ban on smoking is required

పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై వివిధ పన్నుల రూపంలో వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. ఈ ఉత్పత్తులను అమ్ముకునేందుకు అధికారికంగా లైసెన్సులు ఇస్తున్నారు.

ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చూసినా మంచినీరు దొరకని గ్రామాలు, ప్రదేశాలు ఉన్నాయేమోకాని సిగరెట్లు, బీడీలు దొరకని గ్రామాలు లేవు.

ఆదాయం కోసమే ప్రభుత్వమే లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహిస్తూ మరొకపక్క ప్రజారోగ్యాన్ని హరిస్తున్న పొగాకు వినియోగాన్ని నియంత్రిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలి.

ప్రభుత్వానికి నిజంగా ప్రజారోగ్యాన్ని కాపాడే శ్రద్ధ ఉంటే జీవనోపాధి కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం చూపి పొగాకు ఉత్పత్తులను, అమ్మకాలను, వినియోగాన్ని భూటాన్‌ దేశంలో లాగా పూర్తిగా నిషేధించాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

రోరో జా మొక్కకు ముళ్లు, మొగ్గలుంటాయి. ముళ్లు గుచ్చు కున్నప్పుడు నొప్పి కలుగుతుంది. మొగ్గలు లభ్యమైన ప్పుడు ముఖం వికసిస్తుంది.

ఈ వికార వికాసాలు ఆయా వ్యక్తుల మనోభావాలపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వాలు చేసే చట్టాలు కొందరికి బాధ కలిగించవచ్చు.

మరికొందరికి ఊరట కలిగించ వచ్చు. పాలకులు ఇలాంటి విషయాల్లో సమగ్ర అధ్యయనం చేసి తాను చేసే చట్టాల వల్ల ఎవరికి ఉపయోగం? మరెవరికి నష్టం? నష్టపోయిన వారిని ఎలా ఆదుకోవాలి?

అమలులో సాధకబాధకా లు, సాధ్యాసాధ్యాలు,అసలు ఆ చట్టాన్ని అమలుచేసే సామర్థ్యం, అందుకు తగిన సిబ్బంది ఉందా? తదితర అంశాలు ప్రధానంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసి చట్టం చేయాలి.

చట్టం చేసిన తర్వాత రెండో కోణంలో ఆలోచించకుండా త్రికరణ శుద్ధిగా అమలుకు కృషిచేయాలి. అంతేకాని ఓట్లకోసమో లేక మరే ప్రయోజనం ఆశించో చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే నవ్వుల పాలవుతారు.

ధూమపాన నిషేధం విషయంలో పాలకులు ద్వంద్వ విధానాన్ని అవలంబించడం దురదృష్టకరం.

మద్యపానం, ధూమ పానం రెండూ మానవజాతిని పట్టిపీడిస్తున్న రెండు భూతాలు. ఒకటి బ్రహ్మరాక్షసి అయితే మరొకటి పిశాచి. ఇందులో మరో వాదనకు తావులేదు.

మద్యపానాన్ని పెంచిపోషిస్తూ ఆదాయ వనరులుగా మలుచుకుంటున్న పాలకులు ధూమపానం విషయం లో చట్టంచేసి కొంతలోకొంత చర్యలు తీసుకుంటామని చెప్పడం కొంతవరకు మేలేనని చెప్పొచ్చు.

మద్యపానం కంటే ధూమపానం ప్రజారోగ్యం విషయంలో చాలా తీవ్రమైన నష్టం చేస్తున్నదనేది వైద్యరంగనిపుణులే పదేపదే చెప్తున్నారు.

ఊపిరితిత్తులు, కేన్సర్‌, మరెన్నో రోగాలకు ధూమపానం కేంద్ర బిందువని ఎందరో వైద్య నిపుణుల అధ్యయనంలో తేలింది.సిగరెట్‌ పొగలో 4,800లకు పైగా ప్రమాదకర విషవాయువులున్నాయని గుర్తించారు.

నేటికీ భారత్‌లో 30కోట్ల మంది ఈ ధూమపానంతో అన్నివిధాలా చితికిపోతున్నారు. ప్రతి ఏడాది దాదాపు పధ్నాలుగు లక్షల మంది మృత్యువాతపడుతున్నారు.

ఇకపలు రకాల కేన్సర్‌లు,మధుమేహం, గుండెజబ్బులు, శ్వాసకోశవ్యాధులు, ప్రపంచ మానవాళిపాలిట మరణమృదంగాలుగా మారి ప్రజారోగ్యంపై దాడిచేస్తున్నాయి.

పురుషుల్లో వచ్చే కేన్సర్‌లలో 45 శాతానికిపైగా, మహిళల్లో 17 శాతానికిపైగా నోటీ కేన్సర్‌ అయితే దాదాపు 80 శాతానికి ఈ ధూమపానమే కారణమనేది ప్రభుత్వరికార్డులే వెల్లడిస్తున్నాయి.

పొగాకు సంబంధిత వ్యాధులు సోకి అనారోగ్యంపాలై ఏటా కోటి మందికిపైగా కుటుంబాలు కొత్తగా పేదరికంలోకి జారిపోతున్నా యి.

తాజాగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్‌ విస్తరించ డానికి ధూమపానం కూడా తనవంతుపాత్ర పోషిస్తున్నది.

చుట్టా, బీడీ, సిగరెట్‌, గుట్కా అని ఏ పేరుతో పిలిచినా వాటికి మూలం పొగాకే.ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలు అనారోగ్య కారకుల్లో ధూమపానం రెండోస్థానంలో ఉంది.

ధూమపానం చేసేవారే కాదు వారి చుట్టుపక్కల ఉన్నవారి జీవితాలను కూడా కబళించివేస్తున్నది.

ధూమపాన మరణాల్లో తొలి నాలుగుదేశాల్లో భారత్‌ స్థానం సంపాదించుకుంది. భారత్‌లో సగటున రోజూ దాదాపు ఐదువేల మందికిపైగా కొత్తగా ఈ వ్యసనానికి అలవాటు పడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 130కోట్లమంది ధూమపానంలో మునిగితేలుతుంటే భారత్‌లోనే ఇరవైకోట్లవరకు ఉన్నట్లు అంచనా. ఇందులో బీడీలు తాగేవారే అధికంగాఉన్నారు.

బీడీలు, సిగరెట్లు తాగడం సరదాగా ఆరంభమై ఆ తర్వాత అలవాటుగా మారిపోతు న్నది. పదిహేనేళ్ల వయస్సుల్లోనే ఇది ఆరంభంకావడం ఆందోళన కలిగించే అంశం.

ఈ విషయం అనేక అధ్యయనాల్లో బయటకు రావడంతో చిన్నపిల్లలు విరివిగా కొనుగోళ్లు చేసే బిస్కెట్లు,చాక్లెట్లు, శీతలపానీయాలు లభ్యమయ్యే చోట పొగాకు ఉత్పత్తులేవీ అమ్మ కూడదని కేంద్రప్రభుత్వం ఇచ్చిన సూచనలు అనేకరాష్ట్రాలు పట్టిం చుకోవడంలేదు.

పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నియంత్రించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 2003లోనే చర్యలు ప్రారంభించాయి.

బీడీ కట్టల మీద భయంకొల్పే పుర్రెబొమ్మ, శవంబొమ్మ ముద్రిం చాలని ఉత్తర్వులు జారీచేశారు.పొగ తాగడం ఎంతటి ప్రమాద కరమో హెచ్చరిస్తూ పెద్దపెద్ద అక్షరాలతో సిగరెట్‌ డబ్బాలపైన, బీడీకట్టడలపైన ముద్రించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు.

ఇందుకు పాలకులను అభినందించాల్సిందే.అందువల్ల జీవనోపాధి కోల్పో తున్నవారి కుటుంబాల గురించి పట్టించుకోకపోవడం దురదృష్ట కరం.

దీంతో ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ లక్షలాది మంది బీడీ కార్మికులనుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమైంది.జీవనోపాధి కోల్పో తున్నవారికి బీడీపరిశ్రమ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కోట్లాది మందికి బతకుతెరువు ఇస్తున్నదనేది కాదనలేని సత్యం.

అడవుల్లో ఉన్న లక్షలాదిమంది గిరిజన కుటుంబాలకు బీడీ ఆకుల సేకరణ ప్రధాన ఆదాయవనరుల్లో ఒకటి.కొన్ని శతాబ్దాలుగా అదొక కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతున్నది.

ఈ వాస్తవాలు పట్టించుకోకుండా బీడీ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం అవివేకమే.

దీంతో వారంతా సంఘటితమై ఎదురుతిరిగి ఉద్యమించే పరిస్థితిరావడం తో వాటికి రాజకీయ ఒత్తిడిలు జతకలవడం విరమించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆ తర్వాత బహిరంగప్రదేశాల్లో ధూమపా నాన్ని నిషేధిస్తూ కేంద్రఆరోగ్యశాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీనిపై కొన్నిహోటల్‌ యాజమాన్యాలు,మరికొన్ని వ్యాపారసంస్థలు, పలురాష్ట్రాల్లో న్యాయస్థానాల్లో కేసులు వేశాయి.

అన్ని కేసులు ఒకేసారి విచారించాలని ఆరోగ్యశాఖ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.నోటిఫికేషన్‌ అమలును నిలిపివేయాలన్నఅభ్యర్థనను జస్టిస్‌ బి.ఎన్‌.అగర్వాల్‌ ధర్మాసనం తోసిపుచ్చింది.

దీంతో బహి రంగప్రదేశాల్లో నిషేధం అమలుచేసేందుకు నడుంకట్టింది.హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు,ప్రభుత్వ,ప్రైవేట్‌ కార్యాలయాలు, మైదానా లు, పనిచేసే ప్రదేశాలు తదితర వాణిజ్యసముదాయాలన్నీ బహి రంగ ప్రదేశాల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో విశదీకరించారు.

కానీ రోడ్లువిషయాన్ని ప్రస్తావించలేదు.

వీటిని ఉల్లంఘించినవారికి జరి మానా విధించే విధంగాచట్టం రూపొందించారు.అయితే ఆయా యాజమాన్యాలు,కార్యాలయాల్లో, హోటళ్లల్లో పొగతాగేందుకు ప్రత్యేకగదులు ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లోసూచించారు.

ఈ ఉత్తర్వులను అమలుచేయడం సాధ్యంకాదని కొన్నిరాష్ట్రాలు మోకా లడ్డాయి.చట్టంలోకూడా కొన్ని లోపాలున్నట్లు అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.

దీనికితోడు చట్టం అమలు చేసేందుకు అవసరమైన యంత్రాంగం కూడాలేదు.అసలు ఒకవ్యవస్థేలేదు.మరొకపక్కపొగా కు ఉత్పత్తులపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఏటాదాదాపు 30వేలకోట్ల రూపాయలకు పైగా పొగాకు వ్యాపారం జరుగుతుందనిఅంచనా.లక్షలాది మందిరైతులు పొగాకు సాగుపై ఆధారపడి ఉన్నారు.తెలుగు రాష్ట్రాలకు సంబం ధించి కూడాగుంటూరు, కృష్ణా,గోదావరి, ఖమ్మం, అదిలాబాద్‌ వరంగల్‌ తదితరజిల్లాల్లో పొగాకుపండిస్తూనే ఉన్నారు.

ప్రభుత్వమే ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ పొగాకు పంటను రైతులతో సాగు చేయించే అలవాటుచేశారు. ఎక్కడిక్కడ పొగాకు బేరళ్లు వెలిశాయి. రైతులతోపాటు మరెంతో మందికూలీలు దీనిపైఆధారపడిఉన్నారు.

మొన్న గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పొగాకు పండించే రైతులు తమ సమస్యల పరిష్కారంకోరుతూ అందోళనచేపట్టారు. పరిష్కరి స్తామని పాలకులు హామీతో విరమించారు.

ధూమపానాన్ని నిషే ధిస్తే కుటుంబాలన్నీ జీవనోపాధి కోల్పోయి వీధినపడతాయి.ఆ కుటుంబాలు వీధిపాలు కాకుండా చూడాల్సినబాధ్యత ప్రభుత్వంపై ఉంది.వారికి ముందుగా ప్రత్యామ్నాయం చూపించాలి.

అంతేకాదు ప్రభుత్వం ఒక విషయాన్ని విస్మరిస్తున్నది. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై వివిధపన్నుల రూపంలో వేలాది కోట్లరూపాయలు వసూలు చేసు కుంటున్నారు.

ఈ ఉత్పత్తులను అమ్ముకునేందుకు అధికారికంగా లైసెన్సులు ఇస్తున్నారు.

ఇప్పటికీ తెలుగురాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగాచూసినా మంచినీరు దొరకనిగ్రామాలు, ప్రదేశా లు ఉన్నాయేమోకాని సిగరెట్లు,బీడీలు దొరకని గ్రామాల్లేవు.

ఆదాయం కోసమే ప్రభుత్వమే లైసెన్సులిచ్చి ప్రోత్సహిస్తూ మరొకపక్క ప్రజారోగ్యాన్ని హరిస్తున్న పొగాకు వినియోగాన్ని నియంత్రిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలి.

ప్రభుత్వానికి నిజంగా ప్రజారోగ్యాన్నికాపాడే శ్రద్ధఉంటే జీవనోపాధి కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం చూపి పొగాకు ఉత్పత్తులను, అమ్మకాలను,వినియోగాన్ని భూటాన్‌ దేశంలోలాగా పూర్తిగా నిషే ధించాలి.

అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

  • దామెర్ల సాయిబాబ

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/