రేపు కర్నూల్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ రేపు మంగళవారం కర్నూల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. గత కొద్దీ రోజులుగా పలు జిల్లాలో పర్యటిస్తూ..సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ వస్తున్నా జగన్.. రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు శంకుస్ధాపన చేయనున్నారు.

రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. దీనికి సంబదించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసారు.

పర్యటన షెడ్యూల్ చూస్తే..మంగళవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడలోని ఆయన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు.

  • 10 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు.
  • 10.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
  • 11.15 గంటలకు ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా హెలిప్యాడ్‌కు హెలికాప్టర్‌లో వస్తారు.
  • 11.15 నుంచి 11.30 గంటల మధ్య స్థానిక నేతలతో మాట్లాడతారు.
  • 11.35 గంటలకు ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు.
  • 11.35 నుంచి 12.15 గంటలకు ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు
  • 12.40 గంటలకు తిరిగి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు
  • 12.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు.