సజ్జలపై ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైస్సార్సీపీ పార్టీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేల ఫై వేటు వేసిన సంగతి తెలిసిందే. వారిలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఒకరు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అధికార పార్టీపై అలాగే సజ్జల ఫై సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అభ్యర్థికి ఓటేయడానికి అమ్ముడుపోయారని సజ్జల చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఆనం రామనారాయణ రెడ్డి. ‘నేను కూడా మీడియాలో చూశాను.. ప్రభుత్వ సలహాదారు.. మీడియా ప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి…. ఆయన ఎలాంటి వాడు.. ఇవాళ వేలకోట్లకు ఎలా ఎదిగాడో నేను చూస్తూ వచ్చాను.. ఆయనలాగే అందరూ ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువల్లేకుండా ఉంటారు అనుకుంటారు’ అంటూ సజ్జలపై ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికారంలో ఉన్న పార్టీ, ప్రశ్నించే గొంతుకను అణిచివేస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకను ఏ పార్టీ అయినా సద్విమర్శగా తీసుకోవాలని అన్నారు. అనేక సందర్భాల్లో రాష్ట్రంలో, జిల్లాల్లో జరిగే దోపిడీ గురించి ప్రశ్నించానని చెప్పుకొచ్చారు. అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రాజెక్టు పనులు ఎక్కడవి అక్కడే ఆగిపోయాయని చెప్పానని అన్నారు. విమర్శలను సరిగ్గా చూడలేని ప్రభుత్వంతో కలిసి తాను పనిచేశానని రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు గౌరవం, విలువే లేదు. గతంలో సీఎంలు ఎమ్మెల్యేల విలువలను గుర్తించారని ఆనం అన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఎంతో నేతలతో కలిసి పనిచేశానని, ఏనాడు ఇతంగా ప్రజాస్వామ్య విలువలు దిగిజారిపోవడం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.