తెనాలిలో చంద్రబాబు భారీ బహీరంగ సభ

మున్సిపిల్‌ మార్కెట్ వద్ద రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సభ

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు రేపు తెనాలిలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు అమరావతి సంఘీభావ జేఏసీ కన్వీనర్ డాక్టర్ వేమూరి శేషగిరిరావు తెలిపారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ తెనాలిలో గత 27 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన.. ఈ దీక్షల వల్ల ప్రజల్లో సానుకూల ధోరణి పెరుగుతుండడంతో ఓర్వలేని వైఎస్‌ఆర్‌సిపి నేతలు శిబిరంపై దాడిచేసి పోలీసుల సాయంతో తొలగించారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సిపి నేతల దాడిని నిరసిస్తూ రేపు మధ్యాహ్నం జేఏసీ నాయకులను చంద్రబాబు పరామర్శిస్తారని, అనంతరం మునిసిపల్ మార్కెట్ వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ జరుగుతుందని శేషగిరిరావు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమరావతికి సంఘీభావం తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/