నేపాల్‌లో లక్షదాటిన కరోనా కేసులు

కొత్తగా 2059 పాజిటివ్‌ కేసులు

corona virus

ఖాట్మండు: నేపాల్‌లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 2059 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వైరస్‌ బారినపడిన వారిలో 1,680 చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 1,00,676 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 73,023 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 27,053 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లతో 600 మంది మృత్యువాతపడ్డారు. ఇక్కడ కరోనా రికవరీ రేటు 72.5 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 13,279 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 11,45,237 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ దేశ ఆరోగ్య, జనాభా మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి జగదీశ్వర్‌ గౌతమ్‌ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/