దేశంలో కొత్తగా 2858 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గడిచిన 24 గంటలో దేశంలో కొత్తగా 2858 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,31,19,112కు చేరారు. ఇందులో 4,25,76,815 మంది కోలుకోగా, 5,24,201 మంది మృతిచెందారు. ఇంకా 18,096 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 11 మంది మరణించారు. 3355 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలో 899 కేసులు ఉండగా, హర్యాన 439, కేరళలో 419, మహారాష్ట్రలో 263, ఉత్తరప్రదేశ్‌లో 175 చొప్పున ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.59 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 1,91,15,90,370 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీచేశామని పేర్కొన్నది. ఇందులో నిన్న ఒక్కరోజే 15,04,734 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/