మోడి ప్రభుత్వంపై రాహుల్‌ విమర్శలు

మోడికి వీవీఐపీ హెలికాప్ట‌ర్‌..జ‌వాన్ల‌కు నాన్బుల్లెట్ ప్రూఫ్ ట్ర‌క్కులా ?..రాహుల్‌

rahul-gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి మోడి ప్రభుత్వంపై మండిపడ్డారు. మోడి ప్రభుత్వం వీవీఐపీ హెలికాప్ట‌ర్‌ను ఖ‌రీదు చేసిన విష‌యం పై రాహుల్‌ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో పోస్టు చేసిన రాహుల్‌.. మ‌న జ‌వాన్లను నాన్ బుల్లెట్ ప్రూఫ్ ట్ర‌క్కుల్లో యుద్ధానికి పంపుతున్నారు, కానీ ప్ర‌ధాని మోడి మాత్రం 8400 కోట్ల‌తో ప్ర‌త్యేక బుల్లెట్ ప్రూఫ్ విమానం తెప్పించుకున్న‌ట్లు ఆరోపించారు. ఇది ఎంత వ‌ర‌కు న్యాయం అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రెండు నిమిషాలు ఉన్న వీడియోలో.. బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాలు ఉన్నా.. నాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాల్లో త‌మ‌ను త‌ర‌లిస్తున్న‌ట్లు జ‌వాన్లు ఆరోపించారు. వ‌రుస‌గా రెండవ రోజు రాహుల్ ఈ అంశంలో విమ‌ర్శ‌లు గుప్పించారు. గురువారం త‌న ట్వీట్‌లో సియాచిన్‌ల‌డాఖ్ సైనికులకు ఎన్ని నిత్యావ‌స‌రాలు కొన‌వ‌చ్చో చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/