భారత్‌లో ఒక్కరోజుల్లో 16వేల కేసులు నమోదు

4.56 లక్షలు దాటిన మొత్తం కేసుల సంఖ్య

india- corona virus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి విజృంభిస్తుంది. కేసులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలోనే 15,968 కేసులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం 4,56,183 కు చేరాయి. ఇదే సమయంలో నిన్న 465 మంది పరిస్థితి విషమించి మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 14,476కు పెరిగింది. ఇక కరోనా వైరస్ సోకిన వారిలో 2.58 లక్షల మంది ఇంతవరకూ రికవర్ అయ్యారని, రికవరీ రేటు 56.7 శాతానికి చేరుకుందని కేంద్రం పేర్కొంది. మంగళవారం నాడు 2,15,195 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఒకరోజులో చేసిన అత్యధిక పరీక్షల సంఖ్య ఇదేనని పేర్కొన్న ఆరోగ్య శాఖ, ఇంతవరకూ 73,52,911లక్షలకు పైగా టెస్ట్ లను చేశామని వెల్లడించింది. యావరేజ్ పాజిటివ్ రేటు 7.42 శాతమని తెలిపింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/