ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు..విచారణకు రావాలంటూ ఎంపీ రఘురామకు నోటీసులు

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లతో పాటు అనుమానం ఉన్న వాళ్లకు నోటీసులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు నోటీసులు జారీ చేసారు. ఇప్పటికే బీజేపీ అగ్ర నేత బీఎల్ సంతోశ్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్‌కు సిట్ అధికారలు నోటీసులు జారీ చేశారు.

వీరిలో శ్రీనివాస్ మాత్రమే సిట్ ఎదుట విచారణకు హాజరు కాగా.. మిగిలిన ముగ్గురు గైర్హాజరయ్యారు. దీంతో వారిపై సిట్ అధికారులు లుక్‌అవుట్ నోటీసులు జారీచేశారు. తాజాగా.. ఏపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సైతం సిట్ అధికారులు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారితో రఘురామ ఫోటోలు దిగారు. ఆ ఫోటలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.