శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటా విడుదల..టీటీడీ

జూన్ నెల కోటా విడుదల..వెబ్ సైట్, యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం

Tirumala Temple
Tirumala Temple

తిరుమల: తిరుమల శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10 వేలు విరాళంగా ఇచ్చే భక్తులకు తిరుమలలో కల్పించే బ్రేక్ దర్శనం టికెట్లను నేటి నుంచి అందుబాటులోకి తెచ్చినట్టు టీటీడీ పేర్కొంది. వెబ్ సైట్, యాప్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని, పరిమిత సంఖ్యలో జేఈఓ కార్యాలయం నుంచి కూడా టికెట్లను జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆన్ లైన్ మాధ్యమంగా జూన్ నెల కోటాను విడుదల చేశారు. కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నెలలో దర్శనాలను నిలిపివేసిన టీటీడీ, ఆపై లాక్ డౌన్ సడలింపుల తరువాత నిబంధనలకు అనుగుణంగా దర్శనాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆపై భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నామని టీటీడీ ప్రకటించింది.


తాజా అంతర్జాతయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/