రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..దసరాకు ప్రత్యేక రైళ్లు

తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పండగ దసరా. దసరా వస్తుందంటే చాలు రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉన్న సరే..సొంత ఊర్లలో దసరా వేడుకల్లో పాల్గొంటారు. దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ తో పాటు రైల్వే కూడా ప్రత్యేక సర్వీస్ లను అందుబాటులో ఉంచుతుంది. ఈ ఏడాది కూడా దసరాకు ప్రత్యేక రైళ్లు ను సిద్ధం చేసింది దక్షిణ మధ్య రైల్వే.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన రైళ్ల వివరాలు పరిశీలిస్తే..

ట్రైన్ నెం.08579: విశాఖపట్నం-సికింద్రాబాద్ (అక్టోబరు 4 నుంచి నవంబరు 29 వరకు ప్రతి బుధవారం) రాత్రి 7 గంటలకు విశాఖలో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ వస్తుంది.

ట్రైన్ నెం.03225: దానాపూర్-సికింద్రాబాద్ (అక్టోబరు 5 నుంచి డిసెంబరు 7 వరకు)
ట్రైన్ నెం.08580: సికింద్రాబాద్-విశాఖపట్నం (అక్టోబరు 5 నుంచి నవంబరు 30 వరకు)
ట్రైన్ నెం.03253: పాట్నా-సికింద్రాబాద్ (అక్టోబరు 2 నుంచి డిసెంబరు 2 వరకు ప్రతి సోమ, మంగళవారాల్లో), హైదరాబాద్-పాట్నా స్పెషల్ ట్రైన్- అక్టోబరు 4 నుంచి డిసెంబరు 6 వరకు ప్రతి బుధవారం

ట్రైన్ నెం.03226: సికింద్రాబాద్-దానాపూర్ (అక్టోబరు 5 నుంచి డిసెంబరు 7 వరకు)
ట్రైన్ నెం.07255: సికింద్రాబాద్-పాట్నా (అక్టోబరు 6 నుంచి డిసెంబరు 8 వరకు ప్రతి శుక్రవారం)

మరోవైపు.. విశాఖపట్నం- సికింద్రాబాద్ (08579) ప్రత్యేక రైలు.. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29 వరకు ప్రతీ బుధవారం సర్వీసులు అందించనున్నట్టు రైల్వేశాఖ వెల్లడించింది. రాత్రి 7 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఇక సికింద్రాబాద్- విశాఖపట్నం(08580) రైలు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.