కోహ్లీసేనకు సచిన్‌ సలహాలు

కివీస్‌ పిచ్‌లో మ్యాచ్‌కు సూచనలు

Sachin Tendulkar
Sachin Tendulkar

ముంబయి: టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కోహ్లీసేనకు కొన్ని సలహాలు ఇచ్చారు. గత కొన్నేళ్లలో న్యూజిలాండ్‌లో పిచ్‌ల స్వభావం పూర్తిగా మారిపోయిందని సచిన్‌ చెప్పుకొచ్చారు. అక్కడి పిచ్‌లు ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిపోయాయని తెలిపాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై 21తేడాతో వన్డే సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా… ఆ తర్వాత కివీస్ పర్యటనకు బయల్దేరి వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల సిరిస్ ఆడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. టీమిండియా మంచి స్పిన్నర్లు, పేసర్లు కలిగి ఉంది. వెల్లింగ్టన్‌లో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చల్లని గాలులు వీస్తాయి. బౌలింగ్‌లో వైవిధ్యం కనిపిస్తుంది అని సచిన్ చెప్పాడు. బ్యాట్స్‌మన్‌ ఏ ఎండ్‌ నుంచి దాడి చేయాలో గుర్తించాలి. పేసర్లకు గాలి అనుకూలించినా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాలి. గాలి వీస్తున్న వైపు నుంచి పేసర్‌, మరో ఎండ్‌ నుంచి స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించాలి. కివీస్ గడ్డపై రోహిత్‌కు వన్డేల్లో ఓపెనింగ్‌ చేసిన అనుభవం ఉంది. అయితే, టెస్టు క్రికెట్ మాత్రం భిన్నం. కివీస్‌ పచ్చికతో కూడిన పిచ్‌లను రూపొందిస్తే కష్టం అని సచిన్ తెలిపాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/