ఇంగువతో లాభాలు

INGUVA


ఇంగువ ఇదొక ఘాటైన సుగంధ ద్రవ్యం పొడిగా.. ముద్దగా.. రెండు రకాల్లో లభ్యమవుతుంది. పులిహోర, రసం, సాంబారు, పచ్చళ్లు అన్నింట్లో వాడతాం. పదార్థాలు బూజు పట్టకుండా చేస్తుంది. ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గ్యాస్‌, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ పొడిలోని యాంటీ బయోటిక్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను తగ్గిస్తాయి. సెనగగింజ పరిమాణంలో బెల్లం మధ్యలో పెట్టి తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది. కప్పు నీళ్లను బాగా మరిగించి చిటికెడు ఇంగువ వేసి రోజులు రెండు మూడు సార్లు తాగితే తలనొప్పి మాయమవుతుంది. సెనగ గింజంత ఇంగువను వాము, బెల్లంతో కలిపి తీసుకుంటే నులిపెరుగుల సమస్య ఉండదు.
అన్నంలో మొదటి ముద్దను నెయ్యి, వాము, ఇంగువతో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలుండవు. అయితే ఎక్కుగా తీసుకుంటే విరోచనాలు అవుతాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/