మిషన్ భగీరథకు జాతీయ ప్రశంసలు
దేశానికి మార్గదర్శిగా నిలిచే తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం మిషన్‌భగీరథ పదకాన్ని జాతీయ జల్ జీవన్‌మిషన్ ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం ఈపథకం ద్వారా మంచినీటి సరఫరా నిర్వహణలో అవలంభిస్తున్న విధానం దేశంలోని మిగిలి అన్నిరాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని మిషన్ డైరెక్టర్ మనోజ్‌కుమార్‌సాహు అన్నారు. ఈ మేరకు అన్ని రాష్ర్టాలకు లేఖ ద్వారా తన సందేశాన్నిపంపారు. తెలంగాణ ప్రభుత్వం మంచినీటి సరఫరాలో అనుసరిస్తున్న అత్యున్నత సాంకేతిక విధానం ద్వారా నీటి వృధాను అరికట్టి, అవసరమైన మేరకేనీటిని సరఫరా చేయవచ్చునని ఆయన అన్నారు.
దేశంలోని ఇతర రాష్ర్టాలు కూడా నీటి సరఫరా నిర్వహణలో ఫ్లో కంట్రోల్ వాల్వ్ సాంకేతికతను ఉపయోగించాలని ఆయన సూచించారు. ఆయా రాష్ర్టాలు అధ్యయనానికి టెక్నికల్ టీమ్‌లను తెలంగాణ రాష్ర్టానికి పంపి మంచినీటి సరఫరాలో తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని చెప్పారు. కాగా దేశానికి మార్గదర్శిగా నిలిచే తెలంగాణ. ప్రతిష్ఠాత్మక పథకాలు, ప్రాజెక్టులను చేపడుతూ దూసుకుపోతున్న రాష్ట్రం.. మరోసారి మిషన్ భగీరథ రూపంలో దేశానికి ఆదర్శంగా, మార్గదర్శిగా నిలిచింది. మిషన్ భగీరథను చూసి రావాలని కేంద్రమే అన్ని రాష్ర్టాలకు లేఖ రాసింది. దాని సాంకేతికతను వాడుకోవాలని సూచించింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/