అమెరికాలో ఒక్కరోజే 75,600 కొత్త కేసులు

america coronavirus
america coronavirus

అమెరికా: అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. శుక్ర‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 70 వేల‌కుపైగా కేసులు న‌మోద‌య్యాయి. ఒకేరోజు 70 వేలకుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం రెండోసారి. అంత‌కుముందు రోజు కూడా రికార్డు స్థాయిలో ఒకేరోజు 75,600 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఇక‌, వారం వ్య‌వ‌ధిలో ప్ర‌తి ల‌క్ష మందికి 100కు పైగా పాజిటివ్‌ కేసులు న‌మోద‌వుతున్న 18 అమెరికా రాష్ట్రాల‌ను రెడ్ జోన్‌లుగా ప్ర‌క‌టించారు. అమెరికాలో మూడోవంతు భాగం విస్త‌రించి ఉన్న అల‌బామా, అరిజోనా, అర్కాన్సాస్‌, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా, ఇడాహో, క‌న్సాస్‌, లూసియానా, మిస్సిసిపీ, నెవ‌డా, నార్త్ క‌రోలినా, ఓక్ల‌హామా, సౌత్ క‌రోలినా, టెన్నెస్సీ, టెక్సాస్ ఉటాహ్ రాష్ట్రాలు రెడ్‌జోన్ ప‌రిధిలో ఉన్నాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/