టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడగింపు

తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈవోగా కొనసాగాలని ఉత్తర్వులు

ttd eo anil kumar singhal

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పదవిలో కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా 2017 మేలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ డిప్యుటేషన్ పై వచ్చారు. అంతకు ముందు ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ లో రెసిడెంట్ కమిషనర్ గా పని చేశారు. టీటీడీ ఈవో కాలపరిమితి రెండేళ్లు. ఈ నేపథ్యంలో 2019లో ఆయన డిప్యుటేషన్ ను మరో ఏడాది పొడిగించారు. ఇప్పుడు తాజాగా రెండోసారి డిప్యుటేషన్ ను పొడిగించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/