నరేష్ 62 వ చిత్ర ప్రకటన

అల్లరి నరేష్ 62 వ చిత్ర ప్రకటన వచ్చేసింది. నరేష్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు , అభిమానులు ఆయన కు బర్త్ డే విషెష్ అందజేస్తున్నారు. ఇదే క్రమంలో నరేష్ కొత్త చిత్రాల తాలూకా అప్డేట్స్ వచ్చాయి. సోలో బ్రతుకే సో బెటర్‌ ఫేం సుబ్బు మంగాదేవి N62 చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ముందుగా కథ చెప్పేందుకు నరేశ్‌కు ఫోన్‌ చేస్తాడు డైరెక్టర్‌ సుబ్బు . అయితే కథ ఎక్కడ చెప్తావని నరేశ్‌ అడిగితే.. ఫైనల్‌గా నరేశ్‌తో బార్‌లో సిట్టింగ్ వేయిస్తాడు డైరెక్టర్‌ సుబ్బు. కథ ఏంటని నరేశ్‌ అడిగితే.. మూర్ఖత్వంతో బతికే ఓ వ్యక్తి కథే స్టోరీ లైన్‌ అని చెప్పేశాడు సుబ్బు.

నరేశ్‌ కూడా చేసేద్దాం.. అంటూ ఈ సినిమాకు మంచి టెక్నీషియన్స్ కావాలని అడిగితే.. డైరెక్టర్‌ వారిని కూడా ఒక్కొక్కరిగా పరిచయం చేశాడు. ఇంట్రెస్టింగ్ సంభాషణతో సాగుతున్న N62 అనౌన్స్‌మెంట్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. నరేష్ 62 చిత్రాన్ని హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుట్ట తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నాడు.

YouTube video