ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తానని తెలిపిన తారకరత్న..

నటుడు ఎన్.టి.రామారావు గారి మనవడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన తారకరత్న,,మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అవన్నీ నిరాశపరచడం తో తారకరత్న..సినిమాలకు దూరమయ్యాడు. విలన్ గా కూడా ట్రై చేసినప్పటికీ వర్క్ కాలేదు. ప్రస్తుతం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్దమయ్యాడు.

తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను చెప్పుకొచ్చారు. నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లంతా నన్ను దూరం పెట్టినట్టుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదు. మా బాబాయిలు .. అత్తయ్యలు అందరూ కూడా నన్నెంతో బాగా చూసుకుంటూ ఉంటారు. అందరూ అనుకుంటున్నట్టుగా మా మధ్య ఎలాంటివో విభేదాలు లేవు.

ఇక ఎన్టీఆర్ కి పోటీగా నన్ను దింపినట్టుగా కూడా అప్పట్లో చెప్పుకున్నారు. కానీ మా ఫ్యామిలీలో ఎవరూ ఎప్పుడూ అలా అనుకోలేదు. ఎన్టీఆర్ ముందుకు వెళుతున్నాడంటే, నందమూరి ఫ్యామిలీ ముందుకు వెళుతుందనే అర్థం. మేమందరం ప్రేమాభిమానాలతోనే ఉన్నాము. పుకార్లు సృష్టించేవారికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదని అన్నారు.

అలాగే 2024లో జనసేన, టీడీపీ పొత్తుల గురించి తనకు తెలియదని , పొత్తుల గురించి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ను బాబాయ్ అని సంబోధించిన తారకరత్న.. ప్రజల కోసం పవన్ కల్యాణ్ కష్టపడుతున్నారని, ఆయన స్థాయిలో ఆయన పని చేస్తున్నారన్నారు. చిన్నప్పటి నుంచి తాను పవన్ కల్యాణ్ సినిమాలు చూశానని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య పోటీ లాగా తను చూడటం లేదని పేర్కొన్నారు. ఇకపోతే తను, బాబాయ్, తారక్ టీడీపీ కోసం పని చేస్తామని, మామయ్య చంద్రబాబు సూచనల మేరకు అందరం ముందుకు సాగుతామని తారకరత్న చెప్పుకొచ్చారు. జనాలకు మంచి చేయాలనే సదుద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని తెలిపారు.