దిండు తోనూ వ్యాయామం

ఆరోగ్య సంరక్షణ

ప్రసవం అయ్యాక కాల్షియం తగ్గటం, ఇంటి పన్నుల్లో భాగంగా గంటల తరబడి నిలుచుని ఉండటం ..ఆడవాళ్ళలో త్వరగా మోకాళ్ళ నొప్పులకు కారణాలెన్నో.. ఇక ఆర్థరైటిస్ కూడా తోడైతే నడవటమూ ఇబ్బందే.. ఉపసేమానానికి మంచం మీద చేసే ఈ వ్యాయామాలు ప్రయత్నం చేయండి..


మంచం మీద కళ్ళు కిందకు వేలాడేలా కూర్చోవాలి.. కాళ్ళ కింద వరకు దిండు అమర్చుకోవాలి. చేతులు వెనక ఆధారంగా చేసుకుని నెమ్మదిగా రెండు కళ్ళను పైకి లేపి, కొన్ని సెకన్లు ఉంచి., నెమ్మదిగా కిందకి దించాలి.. ఇలా అయిదు సెట్లు చేస్తే సరి.. తర్వాత ఒక కాలినినేలకు ఆనించి, మరోదాన్ని పైకి లేపాలి.. వీలైనంత సేపు అలా ఉంచి, మరో కాలితో చేయాలి.. అలా ఒక్కో కాలితో అయిదు సెట్లు చేయాలి..

విశ్రాంతిగా పడుకొని నెమ్మదిగా కాళ్ళను ముడవాలి.. చేతులు పక్కాగా ఉంచాలి . కళ్ళను కాస్త దూరంగా జరిపి, మోకాళ్ళ మధ్యలో దిండును పెట్టి గట్టిగా అదిమినట్టుగా చేయాలి ఇలా కొన్ని సెకన్లు ఉంచి.. యధాస్థితికి రావాలి.. దీన్ని పది సెట్లు చేయాలి..

సుఖాసనంలో పడుకోండి.. చేతులు కాళ్లకు పక్కాగా ఉండాలి. మోకాళ్ళ కిందుగా దిండును ఏర్పాటు చేసుకోవాలి.. నెమ్మదిగా ఒక కాలిని పైకి లేపాలి.. పది సెకన్లు ఉంచి , నెమ్మదిగా కిందకు దింపాలి.. వీటిని ఉదయం, సాయంత్రం రెండు శాల్లు చేస్తే కీళ్లు పట్టేసినట్టు ఉండటం, నొప్పి వంటివి క్రమంగా తగ్గుతాయి.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/category/telangana/