నెల్లూరు లో అప్పుడే మాటల యుద్ధం మొదలైంది

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీ ల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. తాజాగా నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా నారాయణ పేరును టీడీపీ ఖరారు చేయడం తో..నెల్లూరు సిటీ వైస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ విమర్శలు చేయడం స్టార్ట్ చేసారు. నారాయణ పక్కా బిజినెస్ మేన్ అని, ఎన్నికలైపోయిన తర్వాత ప్రజల్ని పట్టించుకోరని , ఓడిపోయిన తర్వాత నాలుగున్నరేళ్లు ఇప్పుడు ఆయన తిరిగి పోటీ కోసం నెల్లూరుకి వచ్చారని విమర్శించారు.

నాలుగున్నరేళ్లు నెల్లూరు సిటీకి దూరంగా ఉన్న నారాయణ తనపై పోటీ కోసం 150కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారని , ఆ ఖర్చు ఆయన జేబులో నుంచి పెట్టట్లేదని, పిల్లల దగ్గర అధిక ఫీజులు వసూలు చేసి పెడుతున్నారని అనిల్ అన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో చదివే 5లక్షలమంది విద్యార్థులపై ఫీజుల భారం మోపుతున్నారని. అలా 150కోట్లు సేకరించి తనపై పోటీకి దిగుతున్నారని అన్నారు. తనపై పోటీకి దిగాలని నారా లోకేష్ కి తాను సవాల్ విసిరానని, కానీ దానికి ఆయన భయపడ్డారని, తానొక వెర్రి పుష్పం అని నిరూపించుకున్నారని సెటైర్లు పేల్చారు.