ప్రభుత్వ టీచర్లకు మరో షాక్ ఇచ్చిన జగన్

జగన్ సర్కార్ ప్రభుత్వ స్కూల్ టీచర్లకు భారీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం సెల్ ఫోన్ వినియోగం ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లాడి దగ్గరి నుండి పండు ముసలోడి వరకు అంత ఫోన్ తోనే గడిపేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునేవరకు ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఇంతలాగా మనిషిలో ఫోన్ ఒక భాగం అయ్యింది. అలాంటి ఫోన్ వాడకం ఉన్న ఈ క్రమంలో ప్రభుత్వ టీచర్లకు షాక్ ఇచ్చారు సీఎం జగన్.

ప్రభుత్వ స్కూళ్లలో సెల్ ఫోన్లపై నిషేధం విధిస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసారు. ఇకపై తరగతి జరిగే సమయాల్లో నో సెల్ ఫోన్ అంటూ సిబ్బందికి కూడా స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా ఈ నిబంధన పాటించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు వెలువరించింది. అత్యవసరం అయితే HM అనుమతితో మాత్రమే సెల్ ఫోన్ వాడాలని నిబంధన పెట్టింది. అలాగే LED ప్యానల్లు… స్మార్ట్ టీవీలు కేవలం బోధనకు మాత్రమే ఉపయోగించాలని సూచించింది. విద్యా విధానం అమలులో ఈ నిర్ణయం చాలా కీలకం కాబోతోందని అదికారులు భావిస్తున్నారు. అయితే టీచర్లు సెల్ ఫోన్ ను వినియోగించకుండా ఉండటం అంటే అంత ఈజీ కాదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహరం పై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది. ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహరంలో సీరియస్ గా వ్యవహరించాలని భావిస్తోంది. విద్యా వ్యవస్దలో తీసుకువచ్చే మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయాన్ని పరిగణించాల్సి ఉంటుందని, విద్యాశాఖ అదికారులు చెబుతున్నారు.

ఇటీవల ప్రభుత్వమే విద్యా సంస్దల్లో సెల్ ఫోన్ వాడకాన్ని ప్రోత్సహించింది. ఎమిదో తరగతి విద్యార్దులకు ప్రాథమికంగా ట్యాబ్ లను ఇచ్చి వారిని ప్రోత్సహించింది. బై జూస్ వంటి కంటెంట్ లోడ్ చేసి, దాన్ని విద్యార్దులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఇప్పుడు ఫోన్లే వాడొద్దనడం ఎంతవరకు కరెక్ట్ అని మరికొంతమంది ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.