నేడు ఇప్పటంలో పర్యటించబోతున్న నారా లోకేష్

ఇప్పటం గ్రామంలో ఈరోజు టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించబోతున్నారు. రోడ్డు వెడల్పు పేరుతో ప్రభుత్వం ఇప్పటంలోని ఇళ్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లి స్వయంగా బాధితులను పరామర్శించిన ఆయన తాజాగా వారికి రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మీడియాకు తెలియజేశారు.

‘మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వందాష్టీకానికి ఇళ్లు దెబ్బతిన్న వారు, నివాసాలు కోల్పో్యిన వారికి రూ. లక్ష వంతున అందించి అండగా నిలబడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. మార్చి14న ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి ఇళ్లను కూల్చింది. జేసీబీలను పక్కన పెట్టి, పోలీసులను జె.సి.బి.లను పెట్టి, పోలీసులను మోహరింప చేసి మరీ ఇళ్లు కూల్చివేయడం దారుణం. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన జరిగిన మరునాడే పవన్ కళ్యాణ్ ఇప్పటం సందర్శించి బాధితులను పరామర్శించారు’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా నేడు సాయంత్రం 4 గంటలకు ఇప్పటం గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. గ్రామంలో ప్రభుత్వం కూల్చిన ఇళ్ళను పరిశీలించి, బాధితుల్ని పరామర్శించనున్నారు. అనంతరం బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు.