డిసెంబర్ 31 రాత్రింతా భీమ్లా డీజే మోగాల్సిందే

భీమ్లా నాయక్ నుండి అసలు సిసలైన డీజే అప్డేట్ వచ్చింది. ‘లాలా.. భీమ్లా..’ అంటూ ఇప్పటికే ఓ ఊపుఊపేస్తుండగా..ఈ ఊపుకు డీజే జతకబోతుంది. అవును ‘లాలా.. భీమ్లా..’ సాంగ్ ను డిజ్ వెర్షన్ ను సిద్ధం చేసారు థమన్. న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31 రాత్రి 7.02 గంటలకు ‘లాలా డీజే’ పాటను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

. రానా , పవన్ కళ్యాణ్ కలయికలో భీమ్లా నాయక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జనవరి 12 న రిలీజ్ చేయాలనీ అనుకున్నప్పటికీ..సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ చిత్రాలు ఉండడం తో థియేటర్స్ సమస్య తో పాటు కలెక్షన్ల సమస్యలు ఎదురవుతాయని భీమ్లా నాయక్ వాయిదా పడింది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో గిరజాల జుట్టు గల అమ్మాయి నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కూడా హీరోయిన్లుగా నటించారు. “భీమ్లా నాయక్‌”ను నాగ వంశీ నిర్మించగా, థమన్ సంగీతం అందించారు.