విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకుంటున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ … బుధవారం అఖిలపక్ష కార్మిక సంఘాలు జివిఎంసి వరకూ ర్యాలీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందుగానే కూర్మన్నపాలెం గేట్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అక్కడే ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న కార్మికులను అడ్డగించారు.

జివిఎంసి వరకూ ర్యాలీగా వచ్చి బహిరంగ సభ నిర్వహించాలని అఖిల పక్ష కార్మిక సంఘాలు గతంలోనే నిర్ణయించగా ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రజలు, కార్మికులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మోడీ భజన మాని.. ప్లాంట్‌ ని రక్షించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్‌ తోడ్పాడాలంటూ కార్మికులు ముక్త కంఠంతో నినాదాలు చేసి హోరెత్తించారు. బైక్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కార్మికులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలో దాదాపు 500మంది అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేశారు. వేలాదిమంది కార్మికులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.