వైసీపీ నేతలు దాడి చేస్తే.నాకు నోటీసులు ఇవ్వడం ఏంటి..? – నారా లోకేష్

భీమవరం లో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉద్రిక్తత నడుమ సాగింది. భీమవరం నియోజకవర్గంలో లోకేష్ యాత్ర చేస్తుండగా..కొంతమంది వైసీపీ శ్రేణులు టీడీపీ నేతల ఫై దాడికి పాల్పడ్డారు. అయితే దాడికి పాల్పడిన వైసీపీ శ్రేణులను వదిలిపెట్టి..పోలీసులు లోకేష్ కు నోటీసులు ఇవ్వడం ఫై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై లోకేష్ మాట్లాడుతూ..పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంపలో లోకేష్ మాట్లాడుతూ.. ఏపీని దక్షిణ బిహార్ గా మార్చేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భీమవరంలో తన పాదయాత్రలో వైసీపీ విధ్వంసం సృష్టించిందన్నారు. తనపై, టీడీపీ శ్రేణులపై వైపీపీ వర్గీయులు రాళ్లు, సీసాలతో దాడి చేశారని నారా లోకేష్ ఆరోపించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణరాజు తన సొంత నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎంపీ అయినప్పటికీ ఇదివరకే అరెస్ట్ చేసి వేధించారని గుర్తుచేశారు ఇప్పుడు యువగళంలో తనకు రక్షణగా నిలిచిన వాలంటీర్లను పోలీసులు తీసుకెళ్లడం సరికాదన్నారు. అసలు తాను ఏం చేశానని, ఏం అన్నానని నోటీసులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీలో చట్టాలు వైసీపీ నేతలకు అనుకులంగా మారాయన్నారు.