మరికాసేపట్లో ఢిల్లీకి నారా లోకేష్

nara-lokesh-on-chandrababu-arrest

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరికాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న విషయం తెలిసిందే. మరోపక్క చంద్రబాబుపై ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తుండటంతో న్యాయ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై న్యాయ నిపుణులతో మాట్లాడేందుకు లోకేష్ ఢిల్లీకి వెళ్ళుతున్నారు.

మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ ద్వారా జైలు నుండి విడుదలైన చంద్రబాబు..ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. రాజమండ్రి నుండి రోడ్డు మార్గాన ప్రయాణం చేసిన బాబు..ఈరోజు ఉదయం 6 గంటకు నివాసానికి చేరుకున్నారు. నిర్విరామంగా సుదీర్ఘ ప్రయాణంతో ఆయన అలసిపోయారు. దారి పొడవునా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

అర్థరాత్రి వేళ, తెల్లవారు జామున సైతం వేల సంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు. ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మహిళలు పెద్దఎత్తున ఇంటివద్దకు చేరుకుని గుమ్మడికాయలతో దిష్టితీస్తూ అధినేతకు నీరాజనాలు పలికారు. విజయవాడ పశ్చిమ జనసేన ఇంచార్జ్ పోతిన మహేష్ నేతృత్వంలో పెద్దఎత్తున జనసేన కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌కు ఎదురేగి స్వాగతించారు. సంఘీభావంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.