గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్..పెరిగిన గ్యాస్ ధర

నెలమారిదంటే ముందుగా ఆసక్తిగా ఎదురుచూసేవారు గ్యాస్ వినియోగదారులే. గ్యాస్ ధరలు ఎంతగా పెరిగాయో..ఎంత తగ్గాయో అని తెలుసుకునేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. ఈరోజు నవంబర్ నెల మొదలైంది..ఈ క్రమంలో కమర్షియల్ గ్యాస్ ధర పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చింది.

కమర్షియల్ సిలిండర్ ధరను 101.50 రూపాయల వరకు పెంచాయి కంపెనీలు. నేటి నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 1833 రూపాయలకు చేరింది. అయితే గృహ అవసరమైన సిలిండర్ ధరలలో.. ఎలాంటి మార్పులు చేయలేదు కంపెనీలు. కాగా ఇటీవల డొమెస్టిక్ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం… కమర్షియల్ సిలిండర్ ధరలను మాత్రం పెంచుతూ వస్తోంది.