28 మంది ప్రాణాలు బలిగొన్నకల్తీ : నారా లోకేశ్

nara lokesh
nara lokesh

అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో కల్తీ సారా మరణాలపై టీడీపీ నేతలు తెలిపిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. ఇందులో సంబంధించిన ఫోటోలను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అసెంబ్లీలో మా పోరాటం వలనే ప్రభుత్వ యంత్రాoగం ఆగమేఘాలపై సారా స్థావరాలపై దాడులు మొదలుపెట్టింది, అని నారా లోకేశ్ వివరించారు. కల్తీ సారాతో పాటు రాష్ట్రం వ్యాప్తంగా జే బ్రాండ్ లిక్కర్ వలన వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 28 మంది ప్రాణాలు బలిగొన్న కల్తీ సారా, జే బ్రాండ్ లిక్కర్ పై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు కలిసి నిరసన తెలిపారు. కాగా, నేడు జరిగే ఏపీలో అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరపాలని టీడీపీ నేతలు అంటున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/