చంద్రబాబు, రేవంత్ రెడ్డిల కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం కోసం గత మూడు రోజులుగా రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తి కనపరుస్తూ వచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు ఏమాట్లాడతారో …? ఏ ఏ ఏ అంశాల గురించి చర్చిస్తారో..? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఎదురుచూసారు. అందరి ఎదురుచూపులు తగ్గట్లే సమావేశం జరిగింది.

జూబ్లీహిల్స్ నివాసం నుండి ప్రజాభవన్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు కు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్.. చంద్రబాబుకు కాళోజీ నారాయణరావు రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు. ఆ వెంటనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో ఉన్న జ్ఞాపికను సీఎం రేవత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లకు అందజేశారు. అనంతరం వారిరువురిని శాలువతో సత్కరించారు.

అనంతరం సమావేశం మొదలుపెట్టగా.. దాదాపు రెండు గంటల పాటు విభజన అంశాల పరిష్కారంపై చర్చించారు. 10 ఏళ్లుగా పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిపై రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రులతో ఓ కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని రెండు రాష్ట్రాల సీఎంలు డిసైడ్ చేసారు.