యువత భవిష్యత్తును జగన్ ప్రభుత్వం నాశనం చేస్తూందిః నారా లోకేష్‌

nara-lokesh-comments-on-cm-jagan

అమరావతిః సిఎం జగన్ సంక్షేమ పథకాలను చెప్పినట్లు అమలు చేస్తూ ప్రజల చేత మంచి నాయకుడని పేరు తెచ్చుకున్నాడు. కానీ కొన్ని విషయాలలో వైఎస్‌ఆర్‌సిపి ఫెయిల్ అయిందంటూ సొంత పార్టీ నేతలే ఊపుకుంటుంటే, ప్రతిపక్షాలు మాత్రం జగన్ అస్సలు సీఎంగా అనర్హుడని, అస్సలు ప్రజలకు చేసింది ఏమీ లేదంటూ విమర్శిస్తున్నారు. తాజాగాటిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ..జగన్ మినిఫెస్టోలో ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానంటూ చెప్పారు, కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉందని విమర్శించారు. చాలా కాలం నుండి మెగా డిఎస్సి అంటూ చెబుతూ వస్తున్నాడని కానీ మీరే చూస్తున్నారు ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇచ్చింది లేదు అంటూ తీవ్ర స్థాయిలో లోకేష్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆడుతున్న ఈ నాటకాలకు యువత బలి అవుతున్నారన్నారు. యువత భవిష్యత్తును జగన్ ప్రభుత్వం నాశనం చేస్తూ దగా పాలనకు తెరలేపుతోంది అంటూ జగన్ పై ఫైర్ అయ్యారు.