ఓ ప్రైవేటు ఫంక్షన్ లో తారసపడిన బండి సంజయ్ , ఎమ్మెల్సీ కవిత

నిత్యం విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకునే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , ఎమ్మెల్సీ కవిత ఓ ప్రైవేటు ఫంక్షన్ లో తారసపడ్డారు. ఒకరికారు కలుసుకుని నవ్వుతూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ లో వీరిద్దరూ కలుసుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు బసవ లక్ష్మీ నారయణ గృహప్రవేశానికి వీరిద్దరూ హాజరు అయినట్లుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో పాటుగా స్థానిక బీఆర్ఎస్ నేతలను కవిత.. బండి సంజయ్ కు పరిచయం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.