భవిష్యత్ లో ఇండస్ట్రీలతోని జనగామ డెవలప్ మెంట్ అవుతుందిః సిఎం కెసిఆర్‌

CM KCR Public Meeting at Jangaon

జనగామ : జనగామ కి మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తానని సిఎం కెసిఆర్‌ మతెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జనగా మ కరువు ప్రాంతంగా ఉండేది.. ఇప్పుడు అవన్ని మాయమైపోయి.. మెల్ల మెల్లగా అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్ లో ఇండస్ట్రీలతోని జనగామ డెవలప్ మెంట్ అవుతుంది. పాత వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా వడ్లు పండించే తాలుకా జనగామ అని చెప్పారు.

ఎన్నికలు చాలా సందర్భాల్లో వస్తయి. ఎవ్వడో చెప్పిండని.. ఓటు వేయకూడదు. ఓటు మన తలరాతను మార్చుతుంది. రాష్ట్ర దిశ, దశను మార్చుతుంది. మన చేతిలో ఉండే బలమైన ఆయుధం ఓటు.. ఆపద మొక్కులు మొక్కేవారుంటారు. అలా కాకుండా.. మంచి, చెడును గుర్తించి మంచి వైపు నడిపిస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కరువు వచ్చినా జనగామలో మాత్రం కరువు రాదన్నారు. జనగామలో వంద శాతం గ్రామాలకు నీళ్లు అందజేస్తానని తెలిపారు. జనగామ, భువనగిరి గ్రోత్ కారిడార్ గా మారాయి. తొమ్మిదేండ్ల కింద.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అప్పట్లో కరెంట్ కష్టాలు, నీటి కష్టాలుండేవి. ఇప్పుడు ఆ కష్టాలన్ని తొలగిపోయాయి. దేవాదుళ, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాబోతున్నాయి. మీ భూముల మీద హక్కు మీకే ఉండాలి. కాంగ్రెస్ కౌలు రైతులు అని కొత్త కథలు చెబుతుందని పేర్కొన్నారు.