హైదరాబాద్ లో మిస్సైన ఐఐటీ విద్యార్థి ..RK బీచ్ లో ఆత్మహత్య

హైదరాబాద్‌లో మిస్సైన ఐఐటీహెచ్ విద్యార్థి..విశాఖ బీచ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తాండ కు చెందిన కార్తీక్ (21) హైదరాబాద్‌లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. జులై 17న ఐఐటీ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లిన తిరిగి క్యాంపస్‌కు తిరిగి రాలేదు. కార్తిక్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు జులై 19న క్యాంపస్‌కు వెళ్లి ఆరా తీశారు.

అయితే, అక్కడ కూడా లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా కార్తీక్ విశాఖపట్నం వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులను తీసుకుని అక్కడికి వెళ్లారు. అతడి కోసం పోలీసులు, తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు. చివరికి ఈ ఉదయం సముద్రం ఒడ్డున కార్తీక్ మృతదేహం లభ్యమైంది. సముద్రంలోకి దూకి అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. కార్తీక్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.