రాష్ట్ర సర్కార్ చేసే ప్రతి పనిలో కేంద్రం వేలుపెడుతోందని కేసీఆర్ ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్దీ రోజులుగా కేంద్ర సర్కార్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరోసారి కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పనిలో వేలు పెడుతుందని మండిపడ్డారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హయాం నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు కేంద్ర ప్రభుత్వాలు చాలా చీప్ గా వ్యవహరిస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూడు దశల పంచాయతీ రాజ్ వ్యవస్థ అత్యంత కీలకమని… కానీ, తొలి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలను నమ్మకుండా నేరుగా గ్రామాలను నిధులను పంపిణీ చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

జవహర్ రోజ్ గార్ యోజన, పీఎం గ్రామ్ సడక్ యోజన, ఉపాధి హామీ పథకం వంటి కార్యక్రమాలకు గాను స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను పంపించడం సరైనది కాదని కేసీఆర్ అన్నారు. స్థానిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే స్పష్టమైన అవగాహన ఉంటుందని చెప్పారు. రోజువారీ కూలీలకు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వాలు నేరుగా డబ్బును పంపిణీ చేయడం సరైన చర్య కాదని అన్నారు. ఇప్పటికీ ఎన్నో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు విద్యుత్ లేక అల్లాడుతున్నాయని, ప్రజలు చీకట్లలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.