రైతుల మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే
రాజధాని కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతుల్ని సీఎం జగన్ చంపేస్తున్నారు

అమరావతి: రాజధాని కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌గారు చంపేస్తున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వైఎస్సాఆర్‌సిపి ప్రభుత్వం అక్రమ కేసులతో రైతులను బలితీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపు ఆందోళనతో రైతుల మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే అని నారా లోకేష్ దుయ్యబట్టారు. ఇంకా శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న కొడుకు, కోడలిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడంతో రైతు అబ్బూరి అప్పారావు ఆందోళనతో మృతి చెందారు. మహిళా రైతు సామ్రాజ్యమ్మ గుండె పోటుతో మరణించారని అన్నారు. ఈ ఘటనలు నన్ను తీవ్రంగా కలివేశాయని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకి ఈ పరిస్థితి రావడం దారుణమన్నారు. చేసేవి దొంగ పనులు కాబట్టే గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులను దింపారని ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేశారు. ప్రజల మధ్యలోంచి కాకుండా సీఎం గారు దొంగ దారిలో వెళ్లడానికి కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకున్నారని నారా లోకేష్ దుయ్యబట్టారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/