టిడిపి నేతలు స్వార్థకోసమే ఉద్యమం చేస్తున్నారు

ప్రజస్వామ్యంపై లెక్కలేని తనంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy

అమరావతి: రాజధానికోసం టిడిపి నేతల ఆధ్వర్యంలో సాగుతోన్న ఉద్యమాన్ని వైఎస్సార్‌సిపి నేత, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. టిడిపి నేతలు తమ స్వార్థంకోసమే ఈ ఉద్యమం నడిపిస్తున్నారన్నారు. టిడిపి ని ప్రజలు తిరస్కరించినప్పటికీ.. ఆ నేతల్లో మార్పు రాలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై లెక్కలేని తనంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందని అన్నారు. చంద్రబాబు చెప్పే రాజధాని ప్రాంతంలోనే లోకేష్ ను తిరస్కరించారన్నారు. చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం లేదు కాబట్టే.. ఆయనను గెలిపించలేదని చెప్పారు. చంద్రబాబు తన హయాంలో రాజధాని ఏర్పాటులో అసంబద్ధ నిర్ణయాలు తీసుకున్నారని సజ్జల ధ్వజమెత్తారు. తాజాగా టిడిపి కార్యకర్తలు రైతుల పేరుతో హడావిడి చేస్తున్నారని విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/