సిఎం జగన్‌ ఫిబ్రవరి 1 నుండి గ్రామాల పర్యటన

సంక్షేమ పథకాల అమలు ఎలా ఉందో తెలుసుకోనున్న సిఎం

CM Jagan
CM Jagan

అమరావతి: సిఎం జగన్‌ ఏపిలో ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వం పని తీరు గురించి నేరుగా ప్రజలను అడిగి ఆయన తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో అధికారులతో జగన్ సమీక్షించారు. ముఖ్యంగా గ్రామాల్లో పర్యటించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. త్వరలో శ్రీకారం చుట్టనున్న ఈ కార్యక్రమానికి ఖరచ్చబండగ అనే పేరును ఖరారు చేస్తారా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/