ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్‌

MS Dhoni
MS Dhoni

చెన్నై: గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు ధోనీ రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఆపై కూడా జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. రెండు నెలల విశ్రాంతి కాస్త ఆరు నెలలు దాటింది. దీంతో మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు వచ్చాయి. అయినా ధోనీ మాత్రం తన రిటైర్మెంట్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా బీసీసీఐ 2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ వరకూ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులోనూ ధోనీ పేరు లేదు. ఇక ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ విషయాలకు తెరదించుంతూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాసన్‌ మాట్లాడుతూ ధోనీ అభిమానులకు శుభవార్త చెప్పాడు. ‘ధోనీ 2020 ఐపీఎల్‌ ఆడుతాడు. 2020 ఐపీఎల్‌తో పాటు 20021 ఐపీఎల్‌లో కూడా ధోనీ తమ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. వచ్చే ఏడాది మహీ వేలంలో ఉన్నా మేమే తీసుకుంటాం. ధోనీపై నమ్మకం ఉంది, వచ్చే రెండు ఐపీఎల్‌ సీజన్లలో ధోనీ నేతృత్వంలోనే బరిలోకి దిగుతాం’ అని శ్రీనివాసన్‌ చెప్పుకొచ్చాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/