నేడు నారా లోకేష్ పుట్టిన రోజు..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా పార్టీ నేతలు , కార్యకర్తలు , అభిమానులు బర్త్ డే సంబరాలు జరుపుతున్నారు. ఉదయం నుండే పెద్ద ఎత్తున కేక్స్ కట్ చేస్తూ భారీ ప్లెక్సీ లు , కట్ అవుట్ లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే రక్త దానాలు చేయడం , పేదలకు పండ్లు , దుప్పట్లు అందజేయడం వంటివి చేస్తూ వస్తున్నారు.

గుంటూరుజిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడి గ్రామానికి చెందిన రైతు, టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ పుట్టినరోజును వినూత్న రూపంలో చాటారు. ఎకరం పొలంలో వరినారుతో నారాలోకేష్ ముఖ చిత్రం ఆకారంలో పంటను పండించారు. దాదాపు వంద రోజులపాటు ఈ పంటను జాగ్రత్తగా పెంచారు లోకేష్‌ వీరాభిమాని పులి చిన్నా. ఇక పండిన వరిని కోసి ఆ ధాన్యాన్ని లోకేష్‌ తల్లి భువనేశ్వరికి అందిస్తానని తెలిపారు.

ఇక ఈ నెల 27 న కుప్పం నుండి లోకేష్ యాత్ర మొదలుకాబోతుంది. రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు నడవబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రలో దాదాపు రాష్ట్రంలోని ముఖ్యమైన నియోజకవర్గాన్నింటినీ కవర్ చేయనున్నారు.