రాష్ట్రంలో వర్షాలు, సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు , వరదల చర్యల ఫై రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ సమీక్షా నిర్వహించారు. ప్రగతి భవన్‌ నుంచి మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మున్సిపాల్టీ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కల్వర్టులు, వంతెనల దగ్గర హెచ్చరిక సూచీలు ఏర్పాటు చేయాలన్నారు. చెరువులు, కుంటల దగ్గర నిరంతర పర్యవేక్షణ జరపాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాలు, వరద పరిస్థితులపై ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాణనష్టం జరుగకుండా చూడడమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి కేటీఆర్..అధికారులకు సూచించారు. వర్షాలు కొనసాగితే ముందు జాగ్రత్తలపై సిద్ధంగా ఉండాలన్నారు. పునరాతన భవనాలను తొలగించే పనులు చేపట్టాలని తెలిపారు. పురపాలికలో సహాయ చర్యలను సీఎండీఏ పర్యవేక్షించాలని చెప్పారు. పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వర్షాలు తగ్గాక అవసరమైతే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.