మార్చడానికి ఎన్టీఆర్‌ అన్నది పేరుకాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికతః బాలకృష్ణ

balakrishna
balakrishna

హైదరాబాద్‌ః ఇటివల ఏపి ప్రభుత్వం అసెంబ్లీలో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుమార్పుపై ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా బాలయ్య.. ‘మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్‌ అన్నది పేరుకాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు’ అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మరి ఇంత వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ పేరు మార్పు విషయంలో వైఎస్‌ఆర్‌సిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

కాగా, హెల్త్‌ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిడిపి నేతలు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కేవలం పార్టీ నేతలే కాకుండా ఎన్టీఆర్‌ కుటుం సభ్యులు కూడా ఒక్కొక్కరూ ఈ వివాదంపై స్పందిస్తున్నారు. ఎన్టీఆర్‌ పేరు మార్చుతూ అసెంబ్లీ బిల్లును ఆమోదించడంపై ఎన్టీఆర్‌ వారసులు జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌తో పాటు పలువురు వైఎస్‌ఆర్‌సిపి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించగా తాజాగా నందమూరి బాలకృష్ణ ఫైర్‌ అయ్యారు. ఫేస్‌ బుక్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/