సీఎం కేసీఆర్ ను కలిసిన తమిళ్ హీరో విజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తమిళ హీరో విజయ్ మర్యాద పూర్వకంగా కలిశారు. బుధ‌వారం హైద‌రాబాద్ వ‌చ్చిన హీరో విజ‌య్..నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి కేసీఆర్‌ను క‌లిశారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విజయ్ ను ఆహ్వానించి సీఎం వద్దకు తీసుకెళ్లారు.

ఈ సంద‌ర్భంగా విజ‌య్‌ను కేసీఆర్ శాలువాతో స‌త్క‌రించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు. విజ‌య్‌తో పాటు టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కూడా ఉన్నారు. ఈక్రమంలో షూటింగ్ నిమిత్తమే విజయ్ హైదరాబాద్ వచ్చి ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ భేటీలో సీఎం కేసీఆర్, విజయ్ దేని గురించి చర్చించారనే విషయం మాత్రం తెలియరాలేదు.

ప్రస్తుతం హీరో విజయ్ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా , ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.