రేపు ఉప్పల్‌ మ్యాచ్‌ సందర్భాంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు ఆదివారం ఇండియా – ఆస్ట్రేలియా మద్య మూడో టి20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు సాయంత్రం ఇండియా – ఆస్ట్రేలియా టీంలు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రెండు టీం అటగాళ్ళను భారీ పోలీసు బందోబస్తూ మద్య నగరంలోని స్టార్ హోటల్ కు తరలించనున్నారు. రేపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. మ్యాచ్ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. బందోబస్తులో 2500 పోలీసు సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు.

అలాగే మ్యాచ్ నేపాయడంలో మెట్రో సంస్థ కూడా ఓ కీలక ప్రకటన చేసింది. మ్యాచ్‌ కోసం మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అభిమానులు ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా స్టేడియం మెట్రో స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సర్వీసులు నడపనున్నట్లు చెప్పింది.

ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతిస్తారు. ఇతర స్టేషన్లలో దిగేందుకు అవకాశం ఉంటుంది. అమీర్‌పేట, జేబీఎస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి ఇతర కారిడార్లలోకి మారేందుకు కనెక్టింగ్‌ రైళ్లు అందుబాటులో ఉంటాయి.