నాంపల్లి రైలు ప్రమాదం… బాధితులకు ఎక్స్‌గ్రేషియా

Nampally train accident… Ex Gratia to the victims

హైదరాబాద్‌ః నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింన విషయం తెలిసిందే. అయితే, నాంపల్లి రైలు ప్రమాద బాధితులకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రగాయాలైన వారికి రూ. 2.50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ. 50,000 ఇవ్వనున్నట్లు వెల్లడించింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో అందులోని ఆరుగురు ప్రయాణికులు గాయపడిన విషయం తెలిసిందే.

కాగా, ఫ్లాట్ సాంగ్ పైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ ను గట్టిగ ఢీ కొట్టింది చార్మినార్ ఎక్స్ప్రెస్. దీంతో చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పినట్లు అయింది. ఈ తరుణంలోనే రైలు ఒక్కసారిగా కుదుపునకు లోనై అయింది. దీంతో సమాచారం అందుకున్న అధికారులు…. అలర్ట్ అయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. చేతగాత్రులను లాలాగూడ లోని రైల్వే ఆసుపత్రికి తరలిస్తున్నారు.