కుక్క మాంసం తింటే మూడేళ్ల జైలుకే… దక్షిణ కొరియా కొత్త చట్టం

South Korea passes law banning dog meat trade

సియోల్‌: ద‌క్షిణ కొరియా పార్ల‌మెంట్ కీల‌క చ‌ట్టాన్ని రూపొందించింది. కుక్క మాంసం వినియోగాన్ని నిషేధిస్తూ కొత్త‌గా బిల్లును ఆమోదించింది. జాతీయ అసెంబ్లీలో 208-0 ఓట్ల తేడాతో ఆ తీర్మానానికి ఆమోదం ద‌క్కింది. ఎన్నో శ‌తాబ్ధాల నుంచి ద‌క్షిణ కొరియాలో కుక్క మాంసం వినియోగంలో ఉన్న‌ది. ఇప్పుడు ఆ ప్రాక్టీస్‌ను నిషేధిస్తున్నారు. పార్ల‌మెంట్ ఆమోదించిన తీర్మానంపై అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్ సంత‌కం చేయ‌నున్నారు. యూన్ ప్ర‌భుత్వం కుక్క మాంసం వినియోగంపై బ్యాన్‌ను స‌మ‌ర్ధిస్తున్న‌ది. కొత్త బిల్లు ప్ర‌కారం కుక్క‌ల్ని చంప‌డం, బ్రీడింగ్ చేయ‌డం, ట్రేడింగ్‌, అమ్మ‌కాలు.. 2027 నాటికి అక్ర‌మం కానున్నాయి. ఒక‌వేళ 2027 త‌ర్వాత ఎవ‌రైనా కుక్క మాంసాన్ని వినియోగిస్తే వాళ్ల‌కు మూడేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష విధించ‌నున్నారు. నిజానికి డాగ్ మీట్ బ్యాన్‌ను అడ్డుకునేందుకు రైతులు ప్ర‌య‌త్నించారు. ఇప్ప‌టికే ఆ దేశంలో కుక్క మాంస ప‌రిశ్ర‌మ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న‌ది. ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం.. ద‌క్షిణ కొరియా ప్ర‌జ‌లు చాలా వ‌ర‌కు కుక్క మాంసాన్ని తిన‌డం త‌గ్గించిన‌ట్లు తెలుస్తోంది.