మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా

సీఎం ఉద్ధవ్ థాక్రేకు రాజీనామా లేఖ అందజేత

Maharashtra Minister Anil Deshmukh resigns
Anil Deshmukh

Mumbai: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. సీఎం ఉద్ధవ్ థాక్రేకు రాజీనామా లేఖను సమర్పించారు. ఇదిలా ఉండగా , ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ హోం మంత్రిపై అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఆరోపణలపై సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణలో తగిన సాక్ష్యాధారాలు లభిస్తే అనిల్ దేశ్‌ముఖ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో.. అనిల్ దేశ్‌ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/