‘బ్రహ్మాస్త్ర’లో షూటింగ్‌ పూర్తిచేసుకున్న ‘కింగ్‌’

ఇండియాలోనే అతిభారీ బడ్జెట్‌ మూవీ

Nagarjuna completes shooting in 'Brahmastra'
Nagarjuna completes shooting in ‘Brahmastra’

హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ , కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్‌ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర, బాలీవుడ్‌ దర్శకుడు ఆయాన్‌ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ మోస్ట్‌ ఎవేటింగ్‌ సినిమాలో కింగ్‌ నాగార్జున నటిస్తున్నారు..

అయితే తాజా కింగ్‌ నాగార్జునకు సంబంధించిన షూటింగ్‌ ముగిసినట్టుగా బ్రహ్మాస్త్ర టీం అధికారికంగా ప్రకటించింది.. ఇదే విషయాన్ని కింగ్‌ నాగార్జున తన అఫీషియల్‌ ట్విట్టర్‌ ఖాతా ద్వారా పోస్ట్‌చేశారు.. బ్రహ్మాస్త్ర ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ సినిమాలో నటించటం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఓ సాధారణ ప్రేక్షకుడి మాదిరిగా తాను కూడ ఈ సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నట్టుగా ట్వీట్‌చేశారు నాగ్‌..

ఈసినిమాలో నాగార్జునతోపాటు బాలీవుడ్‌ రణబీర్‌ కపూర్‌, డ్రీమ్‌ గర్ల్‌ ఆలియాభట్‌ నటిస్తున్నారు. ఈసినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో ఓ భారీ సెట్‌లో నడుస్తోంది.. మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/