ఆరోగ్యశ్రీ విస్తరణను ప్రారంభించిన సిఎం జగన్
చికిత్సల జాబితాలో మరో 234 వ్యాధులకు స్థానం
అమరావతి: సిఎం జగన్ ఆరోగ్యశ్రీ చికిత్సల విస్తరణను ఈరోజు ప్రారంభించారు. ఇకపై క్యాన్సర్ సహా 2,434 వైద్య ప్రక్రియలకు సంబంధించి ఉచితంగా చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు 7 జిల్లాల్లోనే అమలైన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి మిగిలిన 6 జిల్లాల్లోనూ షురూ అయ్యాయి. ఇప్పటివరకు ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్సల జాబితాకు అదనంగా మరో 234 వ్యాధులను కూడా ప్రభుత్వం చేర్చింది. ఆసుపత్రుల్లో రూ.1000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తారు. బిల్లు రూ.1000 దాటితే మిగతా బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. మిగిలిన శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పథకాన్ని నేడు సిఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి ఈ పథకంరాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/