‘నాంది’ ట్రైలర్‌ చూసి షాకయ్యా…

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు హరీష్‌శంకర్‌

allari naresh- naandi prerelease event
allari naresh- naandi prerelease event

‘అల్లరి’ నరేష్‌ తాజాగా ‘నాంది’ అనే చిత్రంలోనటిస్తున్నారు. ఈచిత్రం త్వరలోప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరలక్ష్మీశరత్‌ కుమార్‌ పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో నటిస్తోంది.. నవమి హీరోయిన్‌గా యస్వీ2 ఎంట్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సతీష్‌ వేగేశ్న నాంది చిత్రాన్ని నిర్మించారు..

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచిస్పందన రాబట్టుకుంది.. ఈచిత్రం ఈనెల 19న విడుదల కానుంది.. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు.. ఈచిత్రం ప్రీరిలీజ్‌ వేడుకను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖనటుడుశరత్‌కుమార్‌, రాధిక, సునీల్‌, ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌, ప్రశాంత్‌వర్మ, సతీష్‌ వేగేశ్న తదితరులు పాల్గొన్నారు..

హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ, ఈ వేడుక తనసినిమా వేడుకలా ఉందన్నారు. నరేష్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.. దర్శకుడు డిఫరెంట్‌ జోనర్స్‌తో ఈచిత్రాన్ని అద్భుతంగా మలిచాడన్నారు.. ఈసినిమా ఒప్పుకుని చేసినందుకు నరేష్‌ గట్స్‌కు హ్యాట్సాఫ్‌ అన్నారు. ఇలాంటి స్క్రిప్టు సెలక్ట్‌ చేసుకోవటమే బెస్ట్‌ సక్సెస్‌ అని నమ్ముతున్నానని అన్నారు..

ఈసినిమాకు పనిచేసి విజ§్‌ుకు సపోర్ట్‌చేసిన ప్రతిఒక్కరికీ థ్యాంక్స్‌అన్నారు. కార్యక్రమంలో నటుడు అల్లరి నరేష్‌ మాట్లాడుతూ, తాను ఇప్పటిదాకా 57 సినిమలు చేశానని, నా ఫస్ట్‌ ప్రయారిటీ కామెడీయే అని అన్నారు.. దానిని వదలను అని అన్నారు. మధ్యమధ్యలో నాంది వంటి డిఫరెంట్‌ జోనర్‌ ఫిలిమ్స్‌ చేస్తానని అన్నారు.. టీం అందరూ కష్టపడి నాంది సినిమాను చేశారన్నారు..

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/